బీజేపీ బంపర్ ఆఫర్…. టిక్ టాక్ లో ఫేమస్ అయిన వారికి ఎమ్మెల్యే టికెట్ పక్కా

బీజేపీ బంపర్ ఆఫర్.... టిక్ టాక్ లో ఫేమస్ అయిన వారికి ఎమ్మెల్యే టికెట్ పక్కా

0
84

ఒకప్పుడు ఈమేయిల్ ,ఫేస్ బుక్, వాట్సాప్ వంటివి ఫేమస్ ఇది అందరికీ తెలిసిందే… ఇప్పుడు వీటన్నింటి కంటే తక్కువ సమయంలో ఎక్కువ ఫేమస్ అయింది టిక్ టాక్…. స్మార్ట్ ఫోన్ ఉన్నప్రతీ మొబైల్ లో ఈ యాప్ తప్పని సరి ఉంటుంది…

ఈ యాప్ ద్వారా చాలామంది ఫేమస్ అయ్యారు. అలాగే ఆత్మహత్యల సంఘటనలను కూడా చూశాము విన్నాము.. సరే ఇవన్ని పక్కన పెడితే టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఓ మహిళకు ఎమ్మెల్యే టికెట్ వరించింది… ఇది అక్షరాల నిజం… టిక్ టాక్ లో వీడియోలు చేసుకుంటున్న ఓ అందాల భామకు ఎమ్మెల్యే టికెట్ వరించింది.

ఈ వింతైన సంఘటన హరియాణాలో జరిగింది. తాజాగా హరియాణా శాసనసభ ఎన్నికల్లో ఓ టిక్ టాక్ స్టార్ కు బీజేపీ తరపున ఎమ్మెల్యే టికెట్ వరించింది… రెండో విడుత జాబితాలో అందాల టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫొగాట్ కు టికెట్ కేటాయించారు… ఈమెకు ఒక లక్ష కు పైగా టిక్ టాక్ లో ఫాలోవర్స్ ఉన్నారు…