నేడు బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపు

0
78

తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ లో నిన్న జరిగిన ఘటనతో బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ ఉదయం నుంచి బోధన నగరంలో బంద్ కొనసాగుతోంది. శివాజీ విగ్రహం తో పాటు బోధన్ అన్ని చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అనుమతి లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వలన ఈ వివాదం ఏర్పడిందని పోలీసులు వివరించారు.

అసలేం జరిగిందంటే.. బీజేపీ, శివసేన నాయకులు రాత్రికి రాత్రి ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీన్ని మరోవర్గం నాయకులు విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. అయితే విగ్రహాన్ని తొలగించాలని ఓ వర్గం డిమాండ్ చేస్తుండగా…విగ్రహాన్ని తొలగించేది లేదని బీజేపీ, శివసేన కార్యకర్తలు భీష్మించుకుని ఉన్నారు.