సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యులతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. తాజాగా బీజేపీ దేశ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఊహించని పరిణామం ఎదురైంది. కొంతమంది గుర్తు తెలియని సైబర్ కేటుగాళ్లు జేపీ నడ్డా అకౌంటు హ్యాక్ చేశారు.
రష్యా ప్రజలతో నిలబడండి. ఇప్పుడు క్రిప్టోకరెన్సీ విరాళాలను స్వీకరిస్తున్నారు. బిట్‌కాయిన్ – ఎథెరియం” అంటూ ఆగంతకులు ట్వీట్లో పేర్కొన్నారు. దీంతోపాటు “ఉక్రెయిన్ ప్రజలతో నిలబడండి. ఇప్పుడు క్రిప్టోకరెన్సీ విరాళాలను అంగీకరిస్తున్నాను.” అంటూ హిందీలో కూడా ట్విట్ చేశారు. దీంతో పాటు పలు కామెంట్లను వరుసగా చేశారు.