కొద్దికాలంగా బీజేపీ జనసేన పార్టీలు దోస్తానం చేసుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పందించారు…
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో బీజేపీ సొంతంగా ఎదగాలన్నది అభిమతమని అన్నారు…. గతంలో టీడీపీ నాయకులు బీజేపీని ఎదగనివ్వకుండా చేశారని ఆయన ఆరోపించారు… జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీలోకి వస్తారనేది ప్రచారమే అని అన్నారు కన్నా
ఇక నుంచి బీజేపీ ఏపీలో సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తోందని అన్నారు… అలాగే మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి కలుసుకోవడం సర్వ సాధారణం అని అన్నారు… అందులో ప్రత్యేక ఏం లేదని అన్నారు… 2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రధాన పోటీ బీజేపీనే అని అన్నారు కన్నా.