బెజవాడ రౌడీలా ప్రవర్తించి పార్టీకి మంచి పేరు తెచ్చావని 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్సీని మెచ్చుకుని తన స్వభావాన్ని బయట పెట్టుకున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి ఎంత ప్రమాదకారులో ప్రజలకు పూర్తిగా తెలిసిపోయిందని ఆరోపించారు… చంద్రబాబు నాయుడు తన మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని మండిపడ్డారు.
రాజధాని పేరుతో 10 లక్షల కోట్ల భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం చంద్రబాబు ఏ గడ్డి కరవడానికైనా సిద్ధంగా ఉన్నారని విజయసాయిరెడ్డి ద్వజమెత్తారు. విలువలు, సిద్ధాంతాలు లేని వ్యక్తులు వ్యవస్థలన్నిటిని బలితీసుకుంటారని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా ఇలాగే సాగిందని అన్నారు. దానికి ఫుల్ స్టాప్ పడిందన్న విషయం తెలుసుకోలేక పోవడం విషాదం అని విజయసాయిరెడ్డి అన్నారు.
అలాగే పవన్ పైకూడా పలు ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి… దత్త పుత్రుడు తన అజ్ఞానాన్ని పదేపదే బయట పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్భాలు పలికిన వెంటనే బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారని అన్నారు. తెలివిలోకి వచ్చి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ఒప్పుకున్నారు. యూ-టర్నుల్లో యజమానిని మించి పోయారని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.