బీజేపీ ఆ రాష్ట్రంపై ఫోకస్ చేసిందా….

బీజేపీ ఆ రాష్ట్రంపై ఫోకస్ చేసిందా....

0
136

రాజస్థాన్ లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి… రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఇటీవలే ముఖ్యమంత్రి అశోక్ గహ్లెత్ ఆరోపించిన విషయం తెలిసిందే… ఇదిలా ఉండగానే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కొంతమంది శాసనసభా సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం వేడెక్కింది… ముఖ్యమంత్రి అశోక్ నన్ను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని సచిన్ పైలట్ ఇప్పటికే కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు తాజాగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని సోనియా గాంధీతో పాటు రాహుల్ ను కలిసి వివరించినట్లు సమాచారం…

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి మద్దతుదారులు మాత్రం సచిన్ పైలట్ బీజేపీకి సన్నిహితంగా మెలుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు.. మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నట్లుగానే రాజస్థాన్ లోనూ ఆ పార్టీ పావులు కదుపుతున్నట్లు మండిపడుతున్నారు… అయితే రాజస్థాన్ లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్ అంతర్గత కలహాలే కారణమని బీజేపీ మరోసారి స్పష్టం చేసింది…

వాళ్ల ఇంటిని వాళ్లే చక్కదిద్దుకోవాలని ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పడే సమయానికే రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడిందని బీజేపీ రాజ్యసభ్యుడు ఓమ్ మాథూర్ అభిప్రాయ పడ్డారు….