కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్దమైన బీజేపీ

కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్దమైన బీజేపీ

0
92

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్దమైందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బంపర్ మెజార్టీ సాధించిన బీజేపీ సౌత్ ఇండియాలో మాత్రం తమ ఉనికిని చాటుకోలేకపోయింది….

కర్నాటక రాష్ట్రంలో మినహా సౌత్ లో ఎక్కడా తన ప్రభావం చూపలేకపోయింది అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సౌత్ ఇండియా వ్యాప్తంగా బీజేపీ జెండా ఎగరాలనే ఉద్దేశంతో కేంద్రం పనిచేస్తోంది… ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో…. ఇప్పటికే ఏపీలో ఆపరేషన్ ఆకర్షన స్టార్ట్ చేసిన బీజేపీ సక్సెస్ దిశగా పయణిస్తోంది…

ఇప్పుడు తెలంగాణపై కన్నేసినట్లు తెలుస్తోంది… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బడా నేతలపై కన్నేసి వారిని పార్టీలోకిలాగే ప్రయత్నంలో ఉంది… త్వరలో వారందరిని పార్టీలో చేర్చుకుని బీజేపీ వచ్చే ఎన్నికలలోపు టీఆర్ ఎస్ కు ప్రధాన పోటీ ఇవ్వాలని చూస్తోందట…