బీజేపీ – జనసేన మరో సరికొత్త ప్లాన్

బీజేపీ - జనసేన మరో సరికొత్త ప్లాన్

0
86

ఆంధ్రప్రదేశ్ లో ఇక స్ధానిక సంస్ధల ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్దం అవుతున్నాయి, బీజేపీ జనసేన ఇటీవల కలవడంతో ఆ రెండు పార్టీలు కలిసి ఇప్పుడు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతాయి అంటున్నారు.

తాజాగా ఈ రెండు పార్టీల నేతలు విజయవాడ వేదికగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ఇక వచ్చేరోజుల్లో కలిసి పోటీ చేయనున్నాము అని తెలియచేసిన విషయం తెలిసిందే, రాష్ట్రంలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నట్టు ప్రకటించింది..ఈ మేరకు ఇరు పార్టీల నేతలు కూడా ఉమ్మడి ప్రకటన చేశారు.

అమరావతి రైతులను కలవడానికి రెండు పార్టీలకు చెందిన సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది… ఈ బృందం అమరావతి రాజధాని రైతులను కలిసి వారికి భరోసా కల్పిస్తుందని సమన్వయ కమిటీ వెల్లడించింది. ఇలా రాజధాని ప్రాంతంలో ఇలాంటి అస్తిరత రావడానికి కారణం కూడా వారే అని విమర్శించింది. రాజధాని మార్పు విషయంలో అసలు వైసీపీ సర్కారు కేంద్రాన్ని సంప్రదించలేదు అని తెలిపారు బీజేపీనేతలు.