బీజేపీకి బిగ్ రిలీఫ్…

బీజేపీకి బిగ్ రిలీఫ్...

0
94

భారతీయ జనతాపార్టీకి భవిష్యత్ లో బిల్లుల ఆమోదంలో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు ఇటీవలే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ బలాన్ని పెంచుకుంది.. సంఖ్యా పరంగా కాంగ్రెస్ కంటే రెండింతల బలాన్ని బీజేపీ పెంచుకుంది… దీంతో రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి ఇప్పటి వరకూ టెన్షన్ పడుతున్న బీజేపీకి ఊరట లభించినట్లు అయింది…

పార్లమెంట్ లో అనేక బిల్లుల విషయంలో బీజేపీకి అనేక సార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి… రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245వరకు ఉంది… 2014 కు మందు వరకు కాంగ్రెస్ ఉభయ సభల్లో బలంగా ఉంది… ఆ తర్వాత వరుసగా రాష్ట్రాలను కాంగ్రెస్ కోల్పోతూ వస్తుండటంతో రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీకి చుక్కెదురవుతూ వస్తోంది…

2014 నుంచి కాంగ్రెస్ బలంక్రమంగా రాజ్యసభలో తగ్గుతూ వస్తుంది… ప్రధానమైన బిల్లుల విషయంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఇతర సభ్యులపై ఆధారపడాల్సి వస్తుంది… అయితే బీజేపీకి రాజ్యసభలో క్రమక్రమంగా బలం పెంచుకుంటుంది…