మంత్రి కేటీఆర్ కు బీజేపి నేత స్ట్రాంగ్ పంచ్ – వీడియో

bjp krishna sagar rao strong counter to ktr

0
85

వాక్సిన్ విధానము, వాక్సిన్ అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిందించేలాగానూ కేంద్రం పై ఆరోపణలు మోపేలాగా మంత్రి కేటీఆర్ చేసిన తప్పుడు ఆరోపణలను తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి  కె.కృష్ణసాగర్ రావు తీవ్రంగా ఖండించారు.

ఆరోగ్యరంగం రాష్ట్ర ప్రభుత్వం అంశం అయినప్పటికీ మొత్తం బాధ్యతని కేంద్రం నెత్తిన వేసేసి చాలా తెలివిగా బాధ్యత నుంచి మంత్రి కేటిఆర్ తప్పించుకుంటున్నారన్నారు కృష్ణసాగర్ రావు .

ప్రజారోగ్య రంగానికి COVID-19 మహమ్మారి ఒక ఛాలెంజ్ విసిరిన ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలు గానూ,అన్ని రంగాల్లోనూ COVID-19 ను కట్టడి చేయడంలో విఫలమయిందు వెెల్లడించారు .

తెలంగాణ రాష్ట్రానికి COVID -19 నిర్వహణ కంటూ ఒక స్పష్టమైన విధానం లేదని, తెలంగాణ రాష్ట్రానికి ICMR చెప్పినట్లుగా టెస్ట్,ట్రేస్, ఐసోలేట్ అనే విధానాన్ని సరిగ్గా అమలుపరచలేదని ఆరోపించారు బీజేపి నేత కృష్ణసాగర్ రావు. అసలు ఒకవైపు విశ్వవ్యాప్తంగా ఈ మహమ్మారి విజృభిస్తుంటే ప్రజారోగ్యం అనే అంశం మీద అసలు బాధ్యత లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రవర్తించిందని కృష్ణసాగర్ రావు విమర్శలు చేసిన వీడియో చుద్దాం… https://www.facebook.com/alltimereport/videos/304133631380342