Breaking news : అర్థరాత్రి బిజెపి నేత అరెస్ట్

0
80

బీజేపీ నేత, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణరెడ్డిని అర్దరాత్రి పోలీసులు అరెస్ట్ చేయడంతో పార్టీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజున అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభ నిర్వహించి జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆ సందర్భంగా మాట్లాడుతూ సభలో కేసీఆర్ ను కించపరిచే విధంగా స్కిట్ వేయించారని జిట్టా పైనా టిఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.

టిఆర్ఎస్ నేతలు పిర్యాదు మేరకు అర్దరాత్రి అరెస్ట్ చేసి బలవంతంగా జిట్టాను  పోలీసులు తీసుకెళ్లారు. ఈ ఘటనపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులివ్వకుండా అర్దరాత్రి హంతకుడు, దోపిడీ దొంగల మాదిరిగా కిడ్నాప్ చేశారని  మండిపడుతూ అర్దరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ఫైర్ అయ్యాడు. పోలీసులు వెంటనే జిట్టా బాలకృష్ణ రెడ్డిని విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించాడు.