కేసీఆర్‌ చేతుల నుంచి అధికారం జారిపోతుంది

-

తెలంగాణ రాష్ట్ర సీఎంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తరుణ్‌ చుగ్‌ మాట్లాడుతూ, తాంత్రికుడు సూచనల మేరకే పార్టీ పేరు మార్చారని ఆరోపించారు. బ్రహ్మాండ రాష్ట్ర సమతి పెట్టుకున్నా అద్భుతాలు జరగవని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ చేతుల నుంచి అధికారం జారిపోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌కు ప్రజలు దూరం అయ్యారన్నారు. ప్రజా ధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్‌ ఫెయిల్‌ అయ్యారని విమర్శలు గుప్పించారు. రాజగోపాల్‌ రెడ్డి కాంట్రాక్ట్‌ల కోసం కాదు.. ఇష్టంతోనే బీజేపీలో చేరారని వెల్లడించారు. మునుగోడులో బీజేపీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

కేసీఆర్‌ నితంతృత్వ పాలనకు చరమగీతం పాడాలనే, కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీలోకి చేరారని అన్నారు.కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో యాత్ర.. త్రెడ్‌మిల్‌ మీద రన్నింగ్‌ చేస్తున్నట్లే ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ కాలం చెల్లిన ఇంజెక్షన్‌ లాంటిదని.. ఆపార్టీ వెంటిలేటర్‌ మీద ఉందని ధ్వజమెత్తారు. 80 ఏళ్ల వృద్ధుడైన మల్లికార్జున్‌ ఖర్గేని బలి పశువును చేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...