కన్ఫ్యూజన్ లో కమలం నాయకులు…

కన్ఫ్యూజన్ లో కమలం నాయకులు...

0
95
MLA Raja Singh

ఏపీ రాజకీయాల్లో కమలంపార్టీ నాయకులు కన్ఫ్యూజన్ గా కొనసాగుతున్నారని వార్తలు వస్తున్నాయి.. ఒక్కో నేత ఒక్కో రకమైన వ్యాఖ్యలు చేస్తూ పార్టీలో అయోమయాన్ని పెంచుతున్నారని చర్చించుకుంటున్నారు… జగన్ సర్కార్ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వ్యతిరేకిస్తూనే ఉన్నారు… ఇసుక కొరత ఇంగ్లీష్ మీడియం మూడు రాజధానులు మండలి రద్దు ఇలా ప్రతీ దాన్ని కన్నా విమర్శిస్తూనే ఉన్నారు…

కానీ అధికార ప్రతినిధి జీవీఎల్ మాత్రం కన్నా వ్యాఖ్యలకు భిన్నంగా ఉంటున్నాయి… ఇటీవలే కన్నా అమరావతి రైతులను కలిసి వాళ్లకు మద్దతు ఇచ్చి వచ్చారు… ఈ పరిణామాలు అలా సాగుతున్నతరుణంలో జీవీఎల్ బాంబు పేల్చారు ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని చెప్పారు… దీంతో కన్నా హర్ట్ అయ్యారు.. అయినా కూడా రాష్ట్ర ఛీఫ్ తాను చెప్పిందే ఫైనల్ అంటూ మళ్లీ ప్రకటించారు…

దీనిపై జీవీఎల్ కూడా తాను కేంద్రంతో మాట్లాడిన తర్వాతే చెబుతున్నానని స్పష్టం చేశారు…ఇక మాజీ మంత్రి పురందేశ్వరి ఒకటి అంటే ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు మరోక విధంగా మాట్లాడుతున్నారు… శాసన మండలిపై పురందేశ్వరి మాట్లాడుతూ… మండలి రద్దు సరైనది కాదని ఆమెఆరోపిస్తే సోము వీర్రాజు మాత్రం అసలు మండలి వ్యవస్థపై ప్రజల్లో సదాభిప్రాయమే లేదని అది ఉన్నా లేకపోయినా నష్టం లేదన అంటున్నారు… మొత్తానికి చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో కమలంపార్టీ నాయకులు కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు…