బీజేపీలో చేరికపై చిరు క్లారిటీ

బీజేపీలో చేరికపై చిరు క్లారిటీ

0
87

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి రాజకీయ పార్టీల్లో చేరిక పై స్పందించారు . తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. చిరంజీవి ప్రస్తుతం ఏపార్టీలో ఉన్నారు అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ తాను ప్రస్తుతం తాను ఇప్పుడు సినిమా పార్టీలో ఉన్నానని స్పష్టం చేశారు…

సినిమా పార్టీలో ఫుల్ బిజీగా ఉన్నానని అన్నారు.. అలాగే తాను బీజేపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలపై కూడా స్పందించారు… కొద్దికాలంగా తాసు బీజేసీలో చేరుతానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని చిరంజీవి తేల్చి చెప్పారు…

ఖైదీ నంబర్ 150 తర్వాత ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరు మరోసారి తొలితరం స్వతంత్ర సమర యోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం మెగా అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు…