బీజేపీలో చేరికపై వైసీపీ ఎంపీ క్లారిటీ

బీజేపీలో చేరికపై వైసీపీ ఎంపీ క్లారిటీ

0
98

ఇటీవలే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దూమారం రేపుతున్న సంగతి తెలిసిందే… ప్రస్తుతం బీజేపీకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో పాటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారని సుజనా సంచలన వ్యాఖ్యలు చేశారు…

వీరు బీజేపీ నాయకత్వంలో పని చేసేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు సుజనా… అయితే దీనిపై వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు… బీజేపీకి వైసీపీ నేతలు ఎవరెవరు టచ్ లో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు… ఇదే క్రమంలో రాజమంహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ కూడా క్లారిటీ ఇచ్చారు…

ప్రస్తుతం సుజనా మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు… పార్లమెంట్ హాల్ లో కూర్చున్న ఎంపీలను చూసి వైఎస్సార్ ఎంపీలు టచ్ లో ఉన్నారనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు… అయితే నిజమైన వైసీపీ ఎంపీలు జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటారని అన్నారు… వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు రాష్ట్ర అభివృద్దికి కృషి చేస్తామని అన్నారు…