బీజేపీలోకి టీడీపీ ఫైర్ బ్రాండ్

బీజేపీలోకి టీడీపీ ఫైర్ బ్రాండ్

0
89

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో తమ్ముళ్లు ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు… ముఖ్యంగా టీడీపీ నాయకులు బీజేపీలోకి చేరేందుకు మొగ్గు చూపుతున్నారు… ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు అలాగే మాజీ మంత్రలు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే…

ఇదే క్రమంలో మరో కీలక నేత టీడీపీ ఫైర్ బ్రాండ్ సాదినేని యామిని కూడా బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… తాజాగా ఆమె టీటీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే… పార్టీలో అంతర్గత విభేదాలు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు…

అయినా కూడా తనకు మంచి గుర్తింపు ఇచ్చారని లేఖలో తెలిపారు యామిని… వ్యక్తిగత కారణాలతో పాటు దేశం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు అలాగే ఇతర బలమైన కారణాలవల్ల తాను రాజీనామా చేసానని తెలిపారు త్వరలో ఆమె బీజేపీలో చేరాలని చూస్తున్నారట… ఈమేరకు కన్నాతో చర్చలు కూడా జరిపారని టాక్