బీజేపీలోకి కమెడియన్ బ్రహ్మానందం?

బీజేపీలోకి కమెడియన్ బ్రహ్మానందం?

0
90

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.. అవును బ్రహ్మనందం అంటే ప్రజలకు సినిమా అభిమానులకు చాలా ఇష్టం. ఆయన మరి రాజకీయాల్లోకి రావాలి అని చాలా మంది అనుకుంటారు, పైగా అలాంటి స్టార్ కమెడియన్ కు రెడ్ కార్పెట్ పరుస్తాయి పార్టీలు.మరి బ్రహ్మీ గురించి ఎందుకు ఇప్పుడు ఈ న్యూస్ వచ్చింది అంటే.

కార్ణాటకలో జరిగిన ఉపఎన్నికల్లో ఆయన బీజేపీ కి మద్దతుగా ఆ పార్టీ తరుపున నిలబడిన డాక్టర్ సుధాకర్ కి ప్రచారం చేశారు. చిక్క బల్లాపురా, బాగేపల్లి , గౌరీ బిదనూరు వంటి ప్రాంతాలలో తెలుగు మాట్లాడే వారు అధికంగా ఉంటారు కాబట్టి అక్కడికి సినిమా నటుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ రాజకీయ నాయకులు చాలా మందిని ఎన్నికల క్యాంపెయినింగ్ కు తీసుకువస్తారు గతంలో కూడా నటులు ఇలాంటి ఎన్నికల ప్రచారాలు చేశారు.

దీంతో బ్రహ్మీ బీజేపీ తరపున అక్కడ సపోర్ట్ చేయడంతో ఈ టాక్స్ మొదలు అయ్యాయి.కాని ఆయనకు ఇటీవల శస్త్ర్ర చికిత్స కూడా జరిగింది ఈ సమయంలో ఆయన కొన్ని సినిమాలు చేసుకుంటూ ఉండాలి అంతేకాని రాజకీయాలు వద్దు అంటున్నారు ఆయన అభిమానులు. మరి ఇది ఎంత వరకూ వాస్తవమో చూడాలి.