బీజేపీలోకి కీలక నేతలు

బీజేపీలోకి కీలక నేతలు

0
87

కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ సౌత్ ఇండియాలో మాత్రం పట్టు సాధించలేకపోయింది… అందుకే ఆపరేషన్ ఆకర్షనను స్టార్ట్ చేసింది ఏపీలో… ఈ ఆపరేషన్ 2024 ఎన్నికల నాటికల్ల సక్సెస్ చేయాలని చూస్తుంది…

అందుకే ప్రతీ ఒక్కరిని పార్టీలోకి లాగేస్తుంది… ఇప్పటికే టీడీపీ కి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకుంది… ఇక వీరితో పాటు మరికొందరు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి…

అందులో ముఖ్యంగా బొబ్బిలి రాజులుగా పేరు పొందిన మాజీ మంత్రి సుజయ కృష్ణా రంగారావు ఆయన సోదరుడు బేబీ నాయనలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… వీరిని పార్టీలో చేర్పించేందుకు సీఎం రమేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…