బీజేపీలోకి మరో సినీ నటుడు

బీజేపీలోకి మరో సినీ నటుడు

0
97

కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే…. కానీ సౌత్ ఇండియాలో మాత్రం పట్టు సాధించలేక పోయింది…. సౌత్ ఇండియాలో కర్నాటకలో మినహా ఎక్కడా మెజార్టీ స్థానాలను గెలుచుకోలేక పోయింది బీజేపీ…

దీంతో వచ్చే ఎన్నికల్లో సౌత్ ఇండియాలో తమ పట్టు సాధించుకోవాలనే ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్షణను స్టార్ట్ చేసింది… ఇప్పటికే ఈ ఆకర్షణకు చాలా మంది ఆకర్షితులు అయ్యారు… తాజాగా మరో కీలక నటుడు కూడా బీజేపీలో చేరారు..

ప్రముఖ తమిళ నటుడు రాధా రవి కమలం పార్టీ తీర్థం తీసుకున్నారు… బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరాడు… రాధా 280 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు… అప్పట్లో ఐశ్వర్యరాయ్ నయనతారలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాధా రవి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే