ఏపీలో బీజేపీ తమ పట్టు సాధించాలనే ఉద్దేశంతో దూకుడును పెంచింది… ఇప్పటికే తెలంగాణలో బీజేపీ పట్టుసాధించింది…. కానీ ఏపీ మాత్రం పట్టు సాధించలేకపోతుంది… అందుకే ఇక తమ దూకుడు పెంచాలనే ఉద్దేశంలో జనసేన పార్టీతో చేతులు కలిపింది…
మున్సిపల్ ఎన్నికల దగ్గరకు వస్తుండటంతో పార్టీని బలోపేతం చేసేందుకు అడుగులు ముందుకు వెస్తోంది… ముఖ్యంగా ఏపీలో బలమైన సామాజికవర్గం కాపు సామాజికర్గానికి బీజేపీ దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది… అందుకే తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కాపు సామాజిక ఉద్యమనేత ముద్రగడను కలిసిశారు…
ఈ సమావేశంలో వీరిద్దరు బీజేపీ జనసేన పొత్తులపై చర్చించినట్లు తెలుస్తోంది… దీంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు… కోస్తాలో ముద్రగడకు మంచి పట్టు ఉంది… ఆయన బీజేపీలో చేరితే పార్టీకి మరింత బలం వస్తుందని అంటున్నారు…