Eatala Rajender: సీఎం కేసీఆర్ పై ఈటెల సెన్సేషనల్ కామెంట్స్

0
90
Eatala Rajender

BJP MLA Eatala Rajender Comments On CM KCR Over Dharani Portal Issues: తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనపై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఎవరి మాట వినడు. ఎమ్మెల్యేలు, మంత్రుల మాట అస్సలు కేర్ చేయడంటూ ఫైర్ అయ్యారు. ధరణి పోర్టల్(Dharani Portal) కల్వకుంట కుటుంబం కోసం మాత్రమే తీసుకొచ్చారని తనదైన శైలిలో విమర్శనాస్థ్రాలు సంధించారు.

ప్రస్తుతం తెలంగాణలో దొరల పాలన నడుస్తుంది. కేసీఆర్ చెప్పిందే వేదం. ధరణి పోర్టల్ ద్వారా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కేవలం బడా నాయకుల అవసరాలు తీర్చేందుకే ధరణి పోర్టల్ తెచ్చారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు.

తెలంగాణ ప్రస్తుతం అప్పుల కుంపటిలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు. రైతులకు మేలు జరగాలంటే తెరాస పాలనను కూకటివేళ్లతో పెకిలించాలి. త్వరలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఆ వెంటనే రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈటెల(Eatala Rajender) హామీ ఇచ్చారు.

అడ్వైజరి బోర్డు ముందుకు ఎమ్మెల్యే రాజాసింగ్..కీలకంగా మారనున్న విచారణ