బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..కేటీఆర్ షాకింగ్ ట్వీట్

BJP MLA sensational comments..KTR shocking tweet

0
102

కర్ణాటకలోని రాయ్‌చూర్‌ పట్టణాన్ని తెలంగాణలో కలిపేయాలంటూ సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ శివ్‌రాజ్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పందించారు. డాక్టర్‌ శివ్‌రాజ్‌ చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియోను అటాచ్‌ చేసి క్రిషాంక్‌ అనే టీఆర్‌ఎస్‌ నాయకుడు చేసిన ట్వీట్‌ను కేటీఆర్ ట్యాగ్‌ చేశారు.

కర్ణాటకలోని రాయ్‌చూర్‌ జిల్లాను తెలంగాణలో విలీనం చేయాలని స్ధానిక బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ డిమాండ్ చేశారు. ఉత్తర కర్ణాటకలో హుబ్లీ, ధార్వాడ్‌, బెంగళూరును పట్టించుకుంటున్నారని, హైదరాబాద్‌ కర్ణాటక ప్రాంతంలో గుల్బర్గా, బీదర్‌ను మాత్రమే చూస్తున్నారని.. తమ రాయచూర్‌ బాగోగులు, సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.

రైతులు, ఇతర అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా అమలుచేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ‘తెలంగాణ ఖ్యాతి సరిహద్దులు దాటింది.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రాయచూర్‌ను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారు. అక్కడున్న ప్రజలంతా ఆయన సూచనను చప్పట్లతో స్వాగతించారు’ అంటూ ట్వీట్‌ చేశారు.

https://twitter.com/KTRTRS