Big Breaking: బీజేపీ ఎమ్మెల్యే సస్పెండ్

0
96
MLA Raja Singh

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెండ్ అయ్యారు. వివిధ విషయాలపై పార్టీ వైఖరికి విరుద్ధంగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇది భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలోని రూల్ XXV10 (ఎ). స్పష్టంగా ఉల్లంఘిస్తోంది. ఈ కారణంగా పార్టీ బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక దీనిపై మిమ్మల్ని పార్టీ నుండి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజులలోపు కారణాన్ని తెలపాలని కోరారు. సెప్టెంబర్ 2, లోపు వివరణ ఇవ్వాలని కేంద్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ సెక్రెటరీ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఆదేశించారు.

అసలేం జరిగింది?

 

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్  మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దీనికి సంబంధించి యూ ట్యూబ్‌లో వీడియోను విడుదల చేయడం మజ్లిస్‌ నేతలను ఆగ్రహానికి గురి చేసింది.

ఈ క్రమంలో రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేయాలంటూ మజ్లిస్‌ నేతలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. మరోవైపు ఎంఐఎం ఎమ్మెల్యే బలాల.. సీపీ కార్యాలయానికి వెళ్లారు. రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక, ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో​ పోలీసులు.. యూ ట్యూబ్‌ను రాజాసింగ్‌ వీడియో తొలగించాలని కోరారు. పోలీసుల అభ్యర్థన మేరకు యూట్యూబ్‌ వివాదాస్పద వీడియోను తొలగించింది.