దేవిశ్రీ ప్రసాద్ కు బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్..ఎందుకో తెలుసా?

BJP MLA warns Devisree Prasad..do you know why?

0
100

‘పుష్ప’ సినిమా ప్రమోషన్ లో భాగంగా దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన దృష్టిలో భక్తి గీతాలు, ఐటెం సాంగ్స్ ఒక్కటేనని దేవిశ్రీ అన్నాడు. అంతేకాదు ‘రింగ రింగా’, ‘ఊ అంటావా మావా’ పాటలను భక్తి పాటలుగా మార్చి పాడాడు.

దేవిశ్రీ ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా ఖండించారు. హిందూ సమాజానికి దేవిశ్రీ ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో డీఎస్పీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దేవిశ్రీకి రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఐటెం సాంగుల్లోని పదాలను దేవుడి శ్లోకాలతో పోల్చడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. తన తప్పును తెలుసుకుని దేవిశ్రీ ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని..లేకపోతే తెలంగాణ ప్రజలు చెప్పులతో కొట్టి తరిమికొడతారని అన్నారు. . మరి దీనిపై దేవిశ్రీ ప్రసాద్ గానీ, పుష్ప టీమ్ గానీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.