జగన్ కు సత్కారాలు ప్రశంసలు బీజేపీ ఎంపీ సీఎం రమేష్

జగన్ కు సత్కారాలు ప్రశంసలు బీజేపీ ఎంపీ సీఎం రమేష్

0
90

తెలుగుదేశం పార్టీలో ఉన్నంత సేపు సీఎం రమేష్ జగన్ పై నిత్యం విమర్శలు చేసేవారు… అయితే బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఆ విమర్శల జోరు కాస్త తగ్గింది.స్టీల్ ప్లాంట్ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చెయ్యడానికి ఇటీవల కడప వెళ్లారు ఏపీ సీఎం జగన్. ఆయన జమ్మలమడుగు చేరుకోగానే పలువురు వైసీపీ నేతలు స్వాగతం పలికారు. కానీ అనూహ్యంగా అక్కడ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రత్యక్షమయ్యారు. వీరిద్దరు కలిసి కాసేపు ముచ్చటించారు .. పలు కుశల ప్రశ్నలు కూడా వేసుకున్నారు.

దీంతో ఒకింత జగన్ కూడా ఆశ్యర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు హృదయపూర్వక ఆహ్వానం పలికిన సీఎం రమేశ్..ఆయనను శాలువాతో సత్కరించారు.. టీడీపీలో ఉన్న సమయంలో సీఎం రమేశ్ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కానీ అప్పట్లో కేంద్రం నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. తన చిరకాల కోరిక అయిన స్టీల్ ప్లాంట్కు జగన్ ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వచ్చిన నేపథ్యంలో ఆయనను పలకరించారు.

మొత్తానికి జగన్ మరో కమిట్మెంట్ తో దీనిని పూర్తి చేస్తాను అని చెప్పడంతో ఆనందంలో ఉన్నారు నేతలు.. కడప జిల్లాకు సాగు నీరు అందించడానికి సీఎంగా జగన్ చేస్తోన్న ప్రయత్నం అభినందనీయమని ఎంపీ రమేశ్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారట..