టీఆర్ఎస్ ను అనుక్షణం నిద్రపోకుండా వెంటాడుతాం: మురళీధర్ రావు

టీఆర్ఎస్ ను అనుక్షణం నిద్రపోకుండా వెంటాడుతాం: మురళీధర్ రావు

0
87

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి… బీజేపీ అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కర్ణాటక పీఠం కూడా సొంతం కావడంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది. హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా సందడి నెలకొంది. కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు బాణసంచా కాల్చి వేడుక జరుపుకున్నారు. అంతేకాదు, ‘నేడు కర్ణాటక.. రేపు తెలంగాణలో బీజేపీ’ అనే ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు.

ఈ సంబరాల్లో పాల్గొన్న బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ మురళీధర్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో ప్రతి క్షణం టీఆర్ఎస్ ను నిద్రపోకుండా వెంటాడుతామని చెప్పారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కు లేదని… అసలైన ప్రతిపక్షం అంటే ఏమిటో తాము చూపిస్తామని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. దక్షిణాదిలో బీజేపీ విస్తరణకు కర్ణాటక ఊతమిస్తుందని తెలిపారు.