బీజేపీ నెక్ట్ ప్లాన్ ఏంటీ…

బీజేపీ నెక్ట్ ప్లాన్ ఏంటీ...

0
73

ఏపీ బీజేపీ నేతలు హస్తిన బాట పట్టనున్నారు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నేతృత్వంలో ఢిల్లీ పర్యటలకు సిద్దం అయ్యారు.. బీజేపీ నేతలు అక్కడ కేంద్ర మంత్రులను కలిసి రాజధాని విషయంలో ఎలా వ్యవహరించాలి ఏపీలో ఎలా ఎదగాలి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది…

ఇందులో ముఖ్యంగా రాజధాని విషయంపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై కేంద్ర పెద్దల అభిప్రాయాలను తీసుకోనున్నారు రాష్ట్రనేతలు… ఇప్పటికే మూడు రాజధానులపై తలో మాట మాట్లాడి సంచలనంగా మారిన రాష్ట్ర కమల నాయకులు ఈ అంశం తమ పరిధిలో లేదని కేంద్రం ప్రకటించడంతో ఇప్పుడు కేంద్రం ఆదేశాను సారం నడుచుకోనున్నారు..

అయితే మూడు రాజధానుల ప్రతిపాధనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని రైతులు 54 రోజులుగా దీక్షలు చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు వివరించే అవకాశం ఉంది… మరి దీనిపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతోందో చూడాలి..