ఆత్మకూరు ఉప ఎన్నికలకు బీజేపీ సిద్ధం..రంగంలోకి ఆరుగురు బిజెపి స్టార్ క్యాంపైన్

0
74

ఏపీ: ఆత్మకూరు ఉప ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం ఆరుగురుతో బిజెపి స్టార్ క్యాంపైన్ ను రంగంలోకి దింపనుంది. సినీ హీరోయిన్ జయప్రద కూడా ఆత్మకూరు ప్రచారానికి వస్తున్నారు. విజయవాడ, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఇప్పటికే ఇంటింటికి ప్రచారం 90 శాతం పూర్తి కాగా..ఎన్నికల ప్రచారంలో బిజెపి శ్రేణులు పూర్తిగా నిమగ్నమయ్యారు. ఏపీ సహ ఇంఛార్జి సునీల్ దేవధర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి 18,19 తేదీలలో ప్రచారం నిర్వహిస్తారు. సినీ నటి జయప్రద19వ తేదీ ప్రచారం నిర్వహిస్తారు.

జాతీయ కార్యదర్శి సత్యకుమార్ 19,20 తేదీలలోను , రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ 19వ తేదీన ,
జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ 17,18 తేదీలలో ప్రచారం నిర్వహిస్తారు. కేంద్ర మంత్రి ఎల్ మురగన్ 20వ తేదీన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తుంది.