తదుపరి ఎన్నికలకు సిద్ధమవుతున్న భాజపా!

తదుపరి ఎన్నికలకు సిద్ధమవుతున్న భాజపా!

0
88

త్వరలో జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు భాజపా సిద్ధమవుతోంది. అందులో భాగంగా హరియాణా, దిల్లీ, మహారాష్ట్రలో ఎన్నికల ఇన్‌ఛార్జిలను నియమించింది. దిల్లీ ఎన్నికల ఇన్‌ఛార్జిగా కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్, హరియాణాకు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్, మహారాష్ట్రకు పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ను నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. అలాగే ఝార్ఖండ్‌ ఎన్నికల బాధ్యతల్ని పార్టీ ఉపాధ్యక్షుడు ఓపీ మాథుర్‌కు అప్పగించారు. హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో ఈ ఏడాది చివర్లో, దిల్లీలో 2020లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దిల్లీ తప్ప మిగిలిన మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం భాజపా అధికారంలో ఉంది. వీటిని నిలబెట్టుకుంటూనే దిల్లీలోనూ ఈసారి పార్టీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనుభవమున్న నాయకులను ఎన్నికల బాధ్యులుగా నియమించినట్లు తెలుస్తోంది.