Election Results: మోదీ-యోగీ మ్యాజిక్ రిపీట్..యూపీలో ట్రెండ్ సెట్ చేసిన బీజేపీ

0
76

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ యూపీలో మళ్లీ అధికార పగ్గాలను తిరిగి బీజేపీ కైవసం చేసుకుంది. వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడం విశేషం. దీనితో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ఆ రాష్ట్ర సీఎం కానున్నారు.  మొత్తం 403 మంది సభ్యులతో కూడిన యూపీ అసెంబ్లీలో.. మ్యాజిక్ ఫిగర్ 202 స్థానాలు.  అధికార బీజేపీ 263 స్థానాల్లో అధిక్యంతో భారీ మెజార్టీ దిశగా దుసుకుపోతోంది. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు యూపీ అధికార పీఠం అందని ద్రాక్షే అయ్యింది. సమాజ్‌వాది పార్టీ-ఆర్ఎల్డీ కూటమి 110 స్థానాల్లో ముందంజలో నిలవగా.. బీఎస్పీ 4 స్థానాలు, కాంగ్రెస్ 4 స్థానాల్లో ముందంజలో నిలుస్తున్నాయి. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.