బోయిగూడ అగ్ని ప్రమాదం..మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్

0
85

హైదరాబాద్- బోయిగూడ అగ్ని ప్రమాదంలో 10 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి  తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారికి ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనలో మృతి చెందిన కార్మికుల మృతదేహాలను సొంతరాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చీఫ్‌ సెక్రెటరీని సీఎం కేసీఆర్ ఆదేశించారు.