మండలిలో లోకేష్ కి దిమ్మదిరిగే షాకిచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ

మండలిలో లోకేష్ కి దిమ్మదిరిగే షాకిచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ

0
89

శాసన మండలిలో ఎమ్మెల్సీ లోకేష్ మంత్రి బొత్స మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది.. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా తమకు సంబంధం లేని అంశాలు తమకు ఆపాదిస్తున్నారు అని విమర్శలు చేశారు నారాలోకేష్.

వైజాగ్ లో ఎంవీఎస్ మూర్తికి చెందిన సంస్థలకు 2013లోనే కేటాయింపులు జరిగాయని, అప్పటికి చంద్రబాబు ముఖ్యమంత్రి కూడా కారని తెలిపారు. కాని వీటికి నారాలోకేష్ బినామి అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని వీటిపై ఆయన సీరియస్ అయ్యారు, అంతేకాదు ఎక్కడ ఎవరు ఉన్నా అందరికి లోకేష్ బినామీ అంటున్నారు ..రేపు మంత్రి బొత్సగారికి కూడా నారాలోకేష్ బినామి అన్న ఆశ్చర్యపోవక్కర్లేదు అని అన్నారు , దీంతో మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహించారు.

పిట్టకొంచెం కూత ఘనం అని ఏదో తాపత్రయపడుతున్నాడులే అని తాము పట్టించుకోవడం లేదు అధ్యక్షా… కానీ, బినామీలు అనే మాట బాగా లేదు. లోకేశ్ కు బినామీ అవ్వాల్సిన అవసరం మాకేం ఉంది అలాంటి రాజకీయాలు పనులు మేము చేయం. లోకేశ్ కు చాలామంది బినామీలు ఉన్నారు.. నేను మంత్రిని అని లోకేష్ పై సటైర్ వేశారు, ఆయనకు ఆయన తండ్రికి 100 మంది బినామీలు ఉన్నారు వారు మైండ్ సెట్ ఇక మారదు అని సటైర్ వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.