రాజధాని విషయంలో మరోసారి బొత్స సంచలన కామెంట్స్

రాజధాని విషయంలో మరోసారి బొత్స సంచలన కామెంట్స్

0
84

చంద్రబాబు నాయుడుపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాజధాని పేరిట దోపిడీకి పాల్పడ్డారని ఆయన ఎద్దేవా చేశారు…

28న అమరావతిలో చంద్రబాబునాయుడు పర్యటించాలని చూస్తున్నారని అయితే రాష్ట్ర ప్రజలకు అలాగే రాజధాని రైతులకు ఆయన క్షమాపణచెప్పిన తర్వాతే పర్యటించాలని బొత్స డిమాండ్ చేశారు… 2015 అక్టోబర్ లో చంద్రబాబు నాయుడు రాజధానికి శంకుస్థాపన చేశారని నాలుగేళ్లలో చేసింది ఏం లేదని అన్నారు…

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరునెలలకే రాజధాని నిర్మాణం గురించి ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు… పేద ప్రజల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని అన్నారు… వారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో ప్రజలు గమనించారని బొత్స అన్నారు…