దేశంలో లాక్ డౌన్ అమలు అవుతోంది, ఈ సమయంలో ఎవరూ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడానికి లేదు… రెడ్ జోన్ సీరియస్ నెస్ ఎక్కువ ఉన్న జోన్లలో అసలు నిత్యవసర వస్తువులకి కూడా ఎవరిని బయటకు రానివ్వడం లేదు.. ఈజీగా వైరస్ సోకే అవకాశం ఉంది కాబట్టి అధికారులే ఇంటికి అన్నీ అందిస్తున్నారు.
అయితే ఈ సమయంలో మన దేశంలో ఏప్రిల్ 14 లాక్ డౌన్ పూర్తి అవుతుంది.. మరి కేంద్రం దీనిని పొడిగిస్తుందా లేదా ఎత్తేస్తుందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది, ఈ సమయంలో కొన్ని రాష్ట్రాలు మాత్రం స్టేట్ లో వైరస్ కేసులు పెరుగున్నాయి కాబట్టి వాటిని తగ్గించేందుకు, వారికి వారే సెల్ప్ గా లాక్ డౌన్ పొడిగించుకుంటున్నారు.
ఇప్పటికే ఒరిస్సా ఈ నెల 30 వరకూ తమ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుంది అని తెలిపింది, ఈ దారిలో పంజాబ్ కూడా చేరింది అక్కడ కూడా ఏప్రిల్ 30 వర కూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది అని ప్రకటించాయి.