మన దేశంలో చాలా వరకూ వ్యాపారాలు డిస్కౌంట్ల మీదనే నడుస్తున్నాయి, డిస్కౌంట్ ఇస్తే చాలు ఎవరైనా దానిని కొనడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు, అందుకే కొత్తగా వచ్చే కంపెనీలు ఆఫర్లు డిస్కౌంట్లు ఎక్కువ ఇస్తూ ఉంటాయి,
తాజాగా ఆ లిక్కర్ షాపు ముందు కనిపించిన ఆఫర్ మాత్రం ఎక్కడా, ఎప్పుడూ చూసి ఉండరు. అక్కడ చిల్డ్ బీర్ (చల్లని బీర్) రూ.140 అని రాశారు. అదే ఠండీ బీర్ (చల్లని బీర్) కావాలంటే మాత్రం రూ.150 అని రాశారు.
అయితే ఇంగ్లీష్ హిందీ ఇలా రెండుసార్లు రాశాడు అది 140 మరొకటి 150 పెట్టాడు, ఇంగ్లీష్ లో చిల్డ్ బీర్ అడిగితే 140 అని ఉంది, అదే ఠండీ బీర్150 అని ఉంది.. చాలా మంది ఆశ్చర్యపోయారు, ఇంతకీ ఇందులో ప్లాన్ ఏమిటి అంటే, చల్లగా ఉంటే 140, ఏకంగా బీరు గడ్డకట్టినంత చల్లగా ఉంటే 150 అదీ దీని వెనుక ఉన్న బీరు ఐడియా.