షర్మిల పాదయాత్రకు బ్రేక్ – తిరిగి అక్కడి నుండే ప్రారంభం

0
113

వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడింది. 22 రోజులుగా షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగిన నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ షర్మిల గారి పాదయాత్ర కు స్వల్ప విరామం ఇస్తునట్టు షర్మిల ప్రకటించారు. మళ్ళి తిరిగి ఈ పాదయాత్ర ఈ నెల 28న సత్తుపల్లి నుంచే పునఃప్రారంభం కానున్నట్టు ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సమాచారం తెలియజేసింది.

ఈనెల 5న సత్తుపల్లి వద్ద 1006km మైలు రాయి దాటిన వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పోరాటం రైతుల కష్టాలను చూసి పరిష్కరించేందుకు జరుగుతుంది. ఇప్పటికే సూర్యాపేట,మెదక్ మార్కెట్ యార్డ్ లను సందర్శించిన షర్మిల గారు మద్ధతు ధరపై రైతుల కష్టాలను పరీక్షిస్తూ వస్తున్నారు. కేవలం మద్దతు ధర చెల్లిచడమే కాకుండా రైతులకు 20శాతం బోనస్ కూడా అందజేయాలని షర్మిల గారు ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు.

దీంతోపాటు యాసంగిలో వరి వేయని రైతులకు ఎకరాకి 25వేలు నష్ట పరిహారం చెల్లించి చేయూత కల్పించాలని హెచ్చరించింది. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగించటానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ, వాడుక రాజగోపాల్, ప్రజా ప్రస్థానం పాదయాత్ర కో ఆర్డినేటర్ అండగా ఉండాలని వైఎస్ షర్మిల కోరారు.