కరోనా విలయతాండవం సృష్టిస్తోంది, ఈ సమయంలో పేద ధనిక అనే భేధాలు లేవు… అందరికి ఇది పాకుతోంది, ఇంట్లో ఉండాలి అని ప్రతీ ఒక్కరిని లాక్ డౌన్ పాటించాలి అని సర్కారు అందుకే చెబుతోంది, మే 3 వరకూ కేంద్రం లాక్ డౌన్ విధించింది.
ఇక దేశంలో ఇప్పటికే 20 వేల కేసులు దాటాయి, ఈ సమయంలో అత్యధికంగా మన దేశంలో మహారాష్ట్రాలో కేసులు పెరుగుతున్నాయి, అక్కడ వేల కేసులు నమోదు అయ్యాయి, కాని తాజాగా ఏకంగా అక్కడ మంత్రికి కూడా కరోనా సోకింది.
మంత్రి జితేంద్ర అహ్వద్ కు కరోనా సోకింది, ఏప్రిల్ 13 కు ముందు ఆయనకు పరీక్ష చేస్తే నెగిటీవ్ వచ్చింది, కాని ఇప్పుడు ఆయనకు పాజిటీవ్ అని తేలింది, ఇక ఆయన భద్రత సిబ్బందిలో ఒకరికి గత కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది.. అప్పటి నుంచి ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారు.. మంత్రికి మళ్లీ తాజాగా టెస్ట్ చేస్తే మాత్రం వైరస్ పాజిటీవ్ వచ్చింది.