బ్రేకింగ్ — రూ. 2000 నోట్ల ముద్రణను ఆపేసిన ఆర్బీఐ కార‌ణం ఇదే

బ్రేకింగ్ -- రూ. 2000 నోట్ల ముద్రణను ఆపేసిన ఆర్బీఐ కార‌ణం ఇదే

0
123

డీ-మోనిటైజేషన్‌లో పాత 500-1000 నోట్ల‌ను మోదీ స‌ర్కారు బ్యాన్ చేసింది, అయితే ఆ
స‌మయంలో కొత్తగా 2000-500 నోట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు..గడిచిన ఆర్ధిక సంవత్సరంలో మాత్రం అసలు ఒక్క రూ. 2 వేల నోటు ముద్రణ చేయలేదు.

ఇక ఈ విషయాన్ని ఆర్బీఐ.. ఆర్టీఐ కార్యకర్త సుధీర్ పెట్టుకున్న దరఖాస్తుకు సమాధానం ద్వారా తెలియజేసింది అయితే ఎందుకు ఇలా ఆపేశారు అనేదానిపై అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు, రెండు వేల నోట్ల కంటే 500 నోట్ల‌ను ఎక్కువ‌గా ముద్రిస్తున్నారు

దీనికి కార‌ణం కూడా ఉంది.. నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ అధికారి ఒకరు వెల్లడించారు.ఇప్పటివరకు చలామణి అవుతున్న నోట్లు చెల్లుతాయి. వాటిపై ఎలాంటి బ్యాన్ లేదు అని తెలియ‌చేశారు, పెద్ద నోట్లు ర‌ద్దు అని బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతోంది కాని ఇది వాస్త‌వం కాదు అని చెబుతున్నారు అధికారులు. న‌ల్ల‌ధ‌నం రూపంలో ఈ 2000 నోట్లు దాస్తున్నారు కాబ‌ట్టి వాటిని కాస్త ప్రింటింగ్ త‌గ్గించారు అని తెలుస్తోంది.