వజ్రం ఎంతో విలువైనది ఇక క్యారెట్ల బట్టీ ధర ఉంటుంది, జస్ట్ 1 లేదా రెండు క్యారెట్లు ఉంటేనే ధర లక్షల్లో ఉంటుంది అలాంటిది వందల క్యారెట్ల పరిమాణంలో ఉంటే ఇక దాని ధర కోట్లను దాటేస్తుంది.. ఆఫ్రికాలోని బోత్సవానాలో ఏకంగా 378 క్యారెట్ల డైమండ్ లభ్యమైంది.
కెనాడాకు చెందిన లుకారా డైమండ్స్కు చెందిన గనిలో ఈ అరుదైన వజ్రం దొరికింది. దీని గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు, ఏకంగా ఈ వజ్రం ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..ఈ వజ్రం 2021 జనవరి 15న కనుగొన్నారు..ఇది 341 క్యారెట్లతో ఉంది. ఇక ఇలాంటివి మన ప్రపంచంలో 54 ఉన్నాయి ఇది 55 వ వజ్రంగా రికార్డుల్లో ఎక్కింది.
దీని ధర ఎంతో తెలుసా 15 మిలియన్ డాలర్లు అంటే రూ.110కోట్లుగా ఉంటుంది…మొత్తం ఇది కంపెనీకి ఎంతో ఉపయోగం అవుతుంది అని అంటున్నారు సంస్ధ ప్రతినిధులు.