హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు జనం బెంబెలెత్తిపోయారు, అయితే మరో ఐదు రోజుల్లో భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు,ఇంకా పలు కాలనీలు నీటిలో ఉన్నాయి, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, ఈ సమయంలో ఆహరం విషయాల్లో అతి జాగ్రత్తలు తీసుకోవాలి.
దోమలు ఈగలు భారీగా వచ్చే అవకాశం ఉంది, అయితే రోడ్లపై ఉండే ఆహారం తీసుకోవద్దు, మరీ ముఖ్యంగా నగర ప్రజలకు వైద్యులు తెలిపేది ఏమిటి అంటే, ఏ వాటర్ తాగినా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి, సాధారణ నల్లా వాటర్ నేరుగా తాగద్దు అని చెబుతున్నారు వైద్యులు.
దీని వల్ల అనేక ప్రమాదాలు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, ఇంటి సభ్యులకి ఒకరికి వచ్చినా ఇది మరింత మందికి వచ్చే అవకాశం ఉంది ..బస్తీలో కాలనీల్లో నీటిని తాగే సమయంలో జాగ్రత్తలు తీసుకుని వేడి చేసుకుని తాగాలి,కాచి చల్లార్చిన నీటిని తాగమని చెబుతున్నారు వైద్యులు, చిన్న పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి, పరిశుభ్రమైన ఆహారం నీరు తప్పక తీసుకోండి.