అప్పుడే పుట్టిన పిల్లలని చాలా మంది ఫోటోలు తీస్తున్నారు, అయితే నాకు కొడుకు పుట్టాడు కూతురు పుట్టింది అని స్టేటస్ లు పెట్టడం వరకూ ఒకే ..ఇక సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆ పసికందుల ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నారు, అయితే ఇలాంటి పనులు చేయద్దు అంటున్నారు వైద్యులు. దీని వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి.
పసి కందును చూస్తే ఎవరికి అయినా ముచ్చట వేస్తుంది, అయితే ఇలా చేయకండి ఎందుకు అంటే ఫోటోలు తీసేటప్పుడు ఒక వేళ ఫ్లాష్ పసి పాప కళ్లల్లో పడితే ప్రమాదం, అంతేకాదు ఎంత డేంజర్ అంటే ఆ కాంతి వల్ల పిల్లలకు కళ్లు కూడా పోతాయి.
ఇటీవల చైనాలో తల్లిదండ్రులకు ఇలాంటి సంఘటన ఎదురైంది.
బాబును చూడడానికి వచ్చిన బంధువు ఒకరు బాబుకు చాలా దగ్గరగా ఫోటో తీసాడు. ఫ్లాష్ ఆఫ్ చేయడం మరవడంతో, ఆ ఫ్లాష్ దెబ్బకి బాబు కన్ను మసకబారింది. ఇక ఒకటే ఏడుపు అంతేకాదు వైద్యులు పరీక్ష చేస్తే కుడి కన్ను పూర్తిగా దెబ్బ తింది అని తెలిపారు, తిరిగి తీసుకురాలేమని డాక్టర్లు చెప్పడంతో బాబు తల్లిదండ్రులు తీవ్రంగా తల్లడిల్లారు. దాదాపు 5 సంవత్సరాలు దాటే వరకూ నేరుగా ఫోటోలు తీయద్దు అంటున్నారు వైద్యులు.