బ్రేకింగ్…విమాన ప్ర‌యాణికుల‌కి గుడ్ న్యూస్ చెప్పిన సంస్ధ‌

బ్రేకింగ్...విమాన ప్ర‌యాణికుల‌కి గుడ్ న్యూస్ చెప్పిన సంస్ధ‌

0
78

దేశంలో లాక్ డౌన్ అమ‌లు అవుతోంది, వ‌చ్చే నెల అంటే మే 3 వ‌రకూ లాక్ డౌన్ అమ‌లులో ఉంటుంది, దీంతో ఈ లాక్ డౌన్ మ‌రిన్ని రోజులు పెంచ‌డంతో ఎక్క‌డ వారు అక్క‌డే ఉండిపోయారు.. ఇక త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్లాలి అని అనుకునే వారు, ఇంకా వెయిట్ చేయాల్సిన ప‌రిస్దితి వ‌చ్చింది.

కాని అంద‌రూ ఏప్రిల్ 14 నుంచి రైలు విమాన సర్వీసులు ఉంటాయి అని అనుకున్నారు, కాని ఇప్పుడు ప‌రిస్దితి దారుణంగా ఉంది… కాబ‌ట్టి వాటిని కూడా మే 3 వ‌ర‌కూ క్యాన్సిల్ చేశారు, అయితే దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది.

మే నెల 4 నుంచి కొన్ని విమానాలను ప్రారంభిస్తామని ఇండిగో ప్రకటించింది. అప్పుడు దేశీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తామని ఇండిగో తెలిపింది, దీంతో ఇది చాలా మందికి గుడ్ న్యూస్ గా చెబుతున్నారు.
అయితే కేంద్రం ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కూ రైల్, బ‌స్ టికెట్ రిజ‌ర్వేష‌న్ చేసుకోవ‌డానికి కూడా వెసులు బాటు లేదు అంటున్నారు.