బ్రేకింగ్ — అమ్మ‌వారి ప్ర‌సాదం ఇక స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా మీ ఇంటికే

బ్రేకింగ్ -- అమ్మ‌వారి ప్ర‌సాదం ఇక స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా మీ ఇంటికే

0
91

మ‌న దేశంలో ఎన్నో ప్రముఖ ఆల‌యాలు ఉన్నాయి, అందులో వైష్ణో దేవి ఆలయం ఒక‌టి..ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్ముకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది.

మ‌న దేశంలో చాలా ప్రాంతాల నుంచి భ‌క్తులు వ‌చ్చి ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తారు, అయితే శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్‌ బోర్డు భక్తులకు ఓ శుభ‌వార్త చెప్పింది.. ఇకపై భక్తులు ఆ దేవి ప్రసాదాన్ని స్పీడ్‌ పోస్టులో పొందవచ్చు. కరోనా నేపథ్యంలో ఆలయానికి రాలేకపోతున్న భక్తులకు ప్రసాదాన్ని స్పీడ్‌ పోస్టు ద్వారా అందజేయాలని నిర్ణయించారు.

ఇక ఎవ‌రైనా అమ్మ‌వారి ప్ర‌సాదాలు పొందాలి అంటే.. ఇక మీ అడ్ర‌స్ కు నేరుగా స్పీడ్ పోస్టు ద్వారా పంపిస్తాము అని తెలిపారు. దీని కోసం జమ్మూ కాశ్మీర్‌ పోస్టల్‌ సర్వీస్ తో ఒప్పందం చేసుకున్నారు.. ఈ ప్ర‌సాదం పొందాలి అంటే ఆలయ అధికారిక వెబ్‌సైట్‌ లేదా ఫోన్‌ ద్వారా ప్రసాదాన్ని ఆర్డర్‌ చేయవచ్చు. వారికి స్పీడ్‌ పోస్ట్‌లో ప్రసాదాన్ని డెలివరీ చేస్తారు. ఇది మంచి నిర్ణ‌‌యం అంటున్నారు భ‌క్తులు, ఇక్క‌డ‌కు నార్త్ ఇండియ‌న్స్ ఈశాన్య ప్రాంతం నుంచి రోజు వేలాది మంది భ‌క్తులు వెళ‌తారు. ఈ క‌రోనాతో అక్క‌డ‌కు భ‌క్తులు రాని ప‌రిస్దితి ఏర్ప‌డింది.