భాగ్యనగరంలో మరో దారుణం జరిగింది, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం రాంపల్లికి చెందిన చెందిన అమ్మాయి కండ్లకోయలోని ఓ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతోంది… కాలేజీ అయిపోయిన తర్వాత రాంపల్లిలోని ఆర్ఎల్ నగర్ బస్టాప్ వెళ్లేందుకు సెవన్ సీటర్ ఆటో ఎక్కింది. ఇక ఆమెతో పాటు కాలేజీ విద్యార్దులు ఉన్నారు.. వారు అందరూ దిగిన తర్వాత ఆమె దిగాల్సిన స్టాప్ వచ్చినా ఆటో ఆపకుండా ముందుకు పోనిచ్చాడు డ్రైవర్ ..
అక్కడ నుంచి ముందుకు తీసుకువెళ్లి మరో వ్యాన్ ఎక్కించాడు, మరో ఇద్దరు వ్యక్తులు ఈ ఆటో డ్రైవర్ కలిసి ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించారు. అటుగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం సైరన్ విన్పించడంతో అక్కడ నుంచి వేగంగా మరో చోటుకి వెళ్లారు.
ఘట్కేసర్ ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ సర్వీసు రోడ్డుకు సమీపంలోని ఓ భవనం వద్దకు ఆమెను తీసుకెళ్లారు. అయితే ఈలోపు ఆమె తల్లికి ఈ విషయం చెప్పింది ..ఆమె ఫోన్ సిగ్నల్ ద్వారా పోలీసులు ఆమె ఉన్న భవనం దగ్గరకు చేరుకున్నారు.. దీంతో అక్కడ నుంచి నిందితులు తప్పించుకున్నారు.. కాని ఆమె కాలికి మాత్రం గాయం అయింది వెంటనే ఆమెని ఆస్పత్రికి తరలించారు.