ఏపీలో రోజు రోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.. లాక్ డౌన్ మళ్లీ విధిస్తే కాని కేసులు తగ్గవు అంటున్నారు నిపుణులు, కాని కేసుల సంఖ్య ఇంతలా పెరుగుతున్నా పూర్తి స్దాయి లాక్ డౌన్ ఇప్పుడు అవ్వని పని అంటున్నారు, అయితే తాజాగా ఏపీలో మూడు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పూర్తి లాక్ డౌన్ విధించారు.
కేసులు భారీగా పెరుగుతున్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించారు.రేపటి నుంచి పూర్తిస్దాయి లాక్ డౌన్ అమలు చేయనున్నారు.
అనంతపురం జిల్లాలో ఆదివారం నుంచి వారం పాటు జిల్లా కేంద్రం సహా ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లులో లాక్‌డౌన్ ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు.
ఒంగోలు, చీరాలలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ ప్రకటించారు. ఇక్కడ కూడా పూర్తిగా ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తారు ఇక శ్రీకాకుళంలో పలాస, కాశీబుగ్గలలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నివాస్ ప్రకటించారు.