బ్రేకింగ్ – ఏపీలో ఈ ప్రాంతంలో 14 రోజులు పూర్తి లాక్ డౌన్

బ్రేకింగ్ - ఏపీలో ఈ ప్రాంతంలో 14 రోజులు పూర్తి లాక్ డౌన్

0
147

దేశ వ్యాప్తంగా వైర‌స్ పాజిటీవ్ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి, ఈ స్దితిలో వైర‌స్ కేసుల సంఖ్య చూస్తుంటే చాలా మంది భ‌య‌ప‌డుతున్నారు, ఏపీ తెలంగాణ‌లో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ
స‌మ‌యంలో మ‌రోసారి లాక్ డౌన్ పెట్టే ఉద్దేశం లేదు అని కేంద్రం తెలిపింది, తాజాగా ఎక్క‌డ కేసులు పెరిగితే అక్క‌డ కంటైన్ మెంట్ జోన్ చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో నగరంలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు కలెక్టర్‌ భాస్కర్‌ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 14 రోజులపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని, ఎలాంటి సడలింపులు ఉండవని తెలిపారు.

జిల్లా కేంద్రాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఇక జిల్లాలో ముఖ్యంగా న‌గ‌రంలో ఇక వ్యాపారాలు కూడా జ‌ర‌గ‌వు అని తెలుస్తోంది, పూర్తిగా అన్నీ లాక్ డౌన్ లో ఉంటాయి, అన్నీ వ్యాపారాలు మూసివేస్తారు
ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 268 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలులో మ‌ళ్లీ 28 పాజిటివ్‌ కేసులు వ‌చ్చాయి దీంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.