బ్రేకింగ్ – ఏపీలో టెన్త్ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పనున్నారా?

బ్రేకింగ్ - ఏపీలో టెన్త్ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పనున్నారా?

0
83

ఏపీలో పదో తరగతి పరీక్షలు జూలై 10 నుంచి 15 వరకూ జరుగనున్నాయి, ఇప్పటికే పూర్తిగా పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు.. అయితే ఇప్పుడు విద్యార్ధులకు మరో గుడ్ న్యూస్ వినిపించనున్నారు అని తెలుస్తోంది, టెన్త్ క్లాస్ ఎగ్జామ్ సెంటర్స్ కేటాయింపులో ఏపీ సర్కార్ నూతన విధానాన్ని అమలు చేయబోతుంది.

ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కడ అయితే ఉన్నారో అక్కడ వారికి దగ్గరగా ఉన్న చోట ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారట, దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు, ఇది సాధ్యమవుతుందా లేదా అనేది చూస్తున్నారు అధికారులు, దీనిపై పూర్తిగా కసరత్తు చేసి కుదిరితే ఈసారి పరీక్షలు ఈ విధానంలో అమలు చేయనున్నారు.

ఎందుకంటే పట్టణాల్లో చదువుతున్న స్టూడెంట్స్ లాక్ డౌన్ తో తమ గ్రామాలకు వెళ్లిపోయారు, దీంతో వారు మళ్లీ అక్కడకు వచ్చి వారం రోజులు ఉండి, పరీక్షలు రాయాలి ట్రావెలింగ్ కు ఇబ్బంది ఇవన్నీ పరిశీలించనున్నారు అధికారులు.