బ్రేకింగ్ – ఏపీ నుంచి హైదరాబాద్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ – ఈపాస్ ఇలా తీసుకోండి

బ్రేకింగ్ - ఏపీ నుంచి హైదరాబాద్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ - ఈపాస్ ఇలా తీసుకోండి

0
103

ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు అధికారులు… అయితే ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరిస్తున్నారు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్… అంతర్రాష్ట్ర రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకూ షరతులు ఉంటాయి అని తెలిపారు.

 

అయితే అత్యవసర ప్రయాణికుల కోసం సోమవారం అంటే మే 10 నుంచి ఈ-పాస్ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. గత ఏడాది కరోనా లాక్ డౌన్ వేళ ఏ విధంగా ఈ పాస్ తీసుకున్నారో అలాగే ఇప్పుడు ఈపాస్ ఉండనుంది…ఈ- పాస్ పోలీస్ సేవ యాప్ ద్వారా ఈ పాస్ తీసుకోవాలి.

 

శుభకార్యాలు నిర్వహించుకోవాలని అనుకుంటే, స్థానిక అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు.

ఏపీలో కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పగటి కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటున్నాయి. ఈ సమయంలోనే దుకాణాలు తీస్తారు మధ్యాహ్నం నుంచి బస్సులు రవాణా వాహనాలు అన్నీ నిలిచిపోతాయి. ఈ నెల 18 వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నారు. తర్వాత కేసుల బట్టీ నిర్ణయం తీసుకుంటారు.