కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాల్లో బస్సులు తిప్పేందుకు ఏపీ తెలంగాణ సిద్దం అవుతున్నాయి, ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది. అటు ప్రైవేటు బస్సులకు కూడా అనుమతివ్వాలని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చారు. దీనిపై అధికారులకు ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకుని అనుమతులు ఇవ్వాలి అని తెలిపారు.
ఇక ప్రయాణికులు బస్సు కచ్చితంగా బస్టాప్ లో ఎక్కాలి మధ్యలో ఆపరు.
కచ్చితంగా బస్టాప్ లోనే బస్సులు ఆపాలి.
బస్టాప్ లో ప్రయాణికులని ఎక్కించుకుని అక్కడే దించుతారు
బస్సు ఎక్కిన ప్రతీ ఒక్కరు తమ డీటెయిల్స్ అడ్రస్ ఇవ్వాల్సిందే
ఒకవేళ ఎవరికైనా వైరస్ లక్షణాలు ఉంటే బస్సు ఎక్కనివ్వరు
బస్టాండులో దిగగానే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు
బస్సులో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి
ఇక 50 శాతం బస్సులు మాత్రమే ముందు నడుపుతారు
తర్వాత నెమ్మదిగా సర్వీసులు పెంచుతారు
ఇక బస్సుల్లో 50 శాతం మాత్రమే సీట్లలో కూర్చొనిస్తారు
బస్సుల్లో భౌతికదూరం పాటించాలి
అన్ని సిట్లకు మార్కింగ్ చేయాల్సిందే
ప్రైవేట్ వాహనాల్లో ముగ్గురికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.
ఇక అంతరాష్ట్ర సర్వీసులపై నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు