బ్రేకింగ్ – ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్.

బ్రేకింగ్ - ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్.

0
89

మన దేశంలో లాక్ డౌన్ అమలు అవుతోంది, అయితే దేశ వ్యాప్తంగా ఈ లాక్ డౌన్ మే 31 వరకూ అమలు అవుతుంది, అయితే లాక్ డౌన్ వేళ పూర్తిగా ఆంక్షలు ఉన్నాయి, ఈ పది రోజుల నుంచి మాత్రమే సడలింపులు ఇచ్చారు, అయితే మార్చి నుంచి ఏప్రిల్ వరకూ లాక్ డౌన్ చాలా సీరియస్ గా జరిగింది, ఈ సమయంలో రోడ్లపైకి పనిలేకపోయినా, ఎవరైనా వచ్చినా..

చిన్న చిన్న కారణాలు చెప్పినా వారి వాహనాలు పోలీసులు ఆపేశారు, వాటిని సీజ్ చేశారు, దీంతో వేలాది వాహనాలు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. అవి ఎప్పుడు వస్తాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు, ఈ సమయంలో ఏపీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

వాహనదారులకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆనాడు లాక్ డౌన్ లో నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలు ఏవైతే ఉన్నాయో, ఆ వాహనాలను తిరిగి పొందొచ్చని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీసు స్టేషన్లో సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే దీనిపై జిల్లా ఎస్పీలకు సమాచారం ఇచ్చారు.